Choose a track to play
కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో
తొలిరేయి వింత హాయిలో ఆవిరేమిటో
కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో
తొలిరేయి వింత హాయిలో ఆవిరేమిటో
తొలిరేయి వింత హాయిలో ఆవిరేమిటో
కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో
కాగుతున్న కోరికంత కాగడాగ మారని
కంటపడని కైపుకథల సంగతేదొ చూడని
కౌగిలిలో నలిపి నలిపి చుక్కలనోడించని
రాలుతున్న మల్లెలు గా పక్కపైన దించని
గాజుల గలగలలు విరజాజుల విలవిలలు కందిపోయి కాలమాగనీ
కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో
తొలిరేయి వింత హాయిలో ఆవిరేమిటో
కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో
ప ని ప ని సా ప ని ప ని సా స గ స గ మా స గ స గ మా
కునుకేదీ కనపడదేం ఏమైందో ఏమో
లోకాలను జోకొట్టే పనిలో ఉందేమో
కొంగు విడిచిపెట్టని నా సిగ్గెటుపొయిందో
జతపురుషుని చేరేందుకు సిగ్గుపడిందేమో
ఊపిరి ఉప్పెనలో తొలిమత్తుల నిప్పులలో (చందమామ నిదర చెదరని)
కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో
తొలిరేయి వింత హాయిలో ఆవిరేమిటో
కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో