Choose a track to play

ఎందరో మహానుభావులు
ఎందరో మహానుభావులు
ఎందరో మహానుభావులు
ఎందరో మహానుభావులు
ఎందరో మహానుభావులు
అందరికీ వందనములు
ఎందరో మహానుభావులు
అందరికీ వందనములు
ఎందరో మహానుభావులు
చందురు వర్ణుని
చందురు వర్ణుని
చందురు వర్ణుని
చందురు వర్ణుని
అంద చందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించు
వారెందరో మహానుభావులు
అందరికీ వందనములు
ఎందరో మహానుభావులు
ఎందరో మహానుభావులు
సామ గాన లోల మనసిజ లావణ్య ధన్య
మూర్ధన్యులెందరో మహానుభావులు
ఎందరో మహానుభావులు
మానస వన చర వర సంచారము నెరిపి మూర్తి బాగుగ పొగడనే వారెందరో మహానుభావులు
ఎందరో మహానుభావులు
సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయు వారెందరో మహానుభావులు
ఎందరో మహానుభావులు
పతిత పావనుడనే పరాత్పరుని గురించి
పరమార్థమగు నిజ మార్గముతోను బాడుచును
సల్లాపముతో స్వర లయాది రాగముల దెలియు
వారెందరో మహానుభావులు
ఎందరో మహానుభావులు
హరి గుణ మణిమయ సరములు గలమున శోభిల్లు
భక్త కోటులిలలో తెలివితో చెలిమితో
కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచు
వారెందరో మహానుభావులు
ఎందరో మహానుభావులు
హొయలు మీరనడలు గల్గు సరసుని సదా కనుల
జుచుచును పులక శరీరులై ఆనంద పయోధి
నిమగ్నులై ముదంబునను యశము గల
వారెందరో మహానుభావులు
ఎందరో మహానుభావులు
పరమ భాగవత మౌని వర శశి విభాకర సనక సనందన
దిగీశ సుర కింపురుష కనక కశ్యపు సుత నారద తుంబురు
పవనసూను బాలచంద్ర ధర శుక సరోజభవ భూసురవరులు
పరమ పావనులు ఘనులు శాశ్వతులు
కమల భవ సుఖము సదానుభవులు గాక
ఎందరో మహానుభావులు
ఎందరో మహానుభావులు
నీ మేను నామ వైభవంబులను
నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము
నీవుయను వచన సత్యమును, రఘువర నీయెడ
సద్భక్తియు జనించకను దుర్మతములను కల్ల జేసినట్టి
నీమది నెరింగి సంతసంబునను
గుణ భజనానంద కిర్తనము జేయు
వారెందరో మహానుభావులు
ఎందరో మహానుభావులు
భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణము మర్మములను
శివాది షణ్మతముల గూఢములన్
ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబుల నెరిగి
భావ రాగ లయాది సౌఖ్యముచే
చిరాయువుల్ గలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైన
వారెందరో మహానుభావులు
ప్రేమ ముప్పిరి గొన్న వేళ నామము దలచేవారు
రామభక్తుడైన త్యాగరాజనుతుని నిజ దాసులైన
వారెందరో మహానుభావులు
అందరికీ వందనములు
ఎందరో మహానుభావులు