Single / Track
ఎదలో నిన్నే ఎలిగించా
ఎదలో నిన్నే ఎలిగించా
గీతార్థ సూక్తిగా విధిగా నిత్యం పఠించా
విధిగా నిత్యం పఠించా ఖూరాను పంక్తిగా
ఎదలో నిన్నే ఎలిగించా
మరణాల పిదప కూడా
మరణాల పిదప కూడా నీతోనే నేనుగా
ఎదలో నిన్నే ఎలిగించా
ఎదలో నిన్నే ఎలిగించా
గీతార్థ సూక్తిగా
ఏడాది పొడవు చైత్రం నీ ప్రేమచిత్రమే
తనజంట నడుచు భాగ్యం
మన పూర్వ పుణ్యమే
ప్రేమన్న చిన్న ఈ మాటకు
ప్రేమన్న చిన్న ఈ మాటకు లేదు కాలమే
నిండార తనలో ఒదిగివున్నది విశ్వగోళమే
గరళాన చేదు మరపించే మనశ్శాంతి మందువయినావే
ఊసులాడు ఈదు ఉత్సవమై ప్రాణాలు నిలిపినావే
రుధిరాన శాసనంలా
రుధిరాన శాసనంలా ఎన్నటికీ జత నువ్వే
ఎదలో నిన్నే ఎలిగించా
ఎదలో నిన్నే ఎలిగించా
గీతార్థ సూక్తిగా