Choose a track to play
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విలా విల విలా విల విలా
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గలా గల గలా గల గలా
ఎందుకో ఏకాంతవేళా చెంతకే రానందీ వేళ
గాలిలో రాగాలమాలా జంటగా తోడుంది నీలా
నీ ఊహలో కలా ఊగింది ఊయలా
ఆకాశవాణిలా పాడింది కోయిలా
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విలా విల విలా విల విలా
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గలా గల గలా గల గలా
సరిగమలే వర్ణాలుగా కలగలిసేనా
కంటి పరదా నీ బొమ్మలా కళలొలికేనా
వర్ణమై వచ్చానా వర్ణనై పాడానా
జాణ తెలుగులా జాణ వెలుగులా
వెన్నెలై గిచ్చానా వెకువే తెచ్చానా
పాల మడుగులా పూల జిలుగులా
అన్ని పోలికలు విన్న వేడుకలో ఉన్నా
నువ్వేమన్నా నీ మాటలో నన్నే చూస్తున్నా
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విలా విల విలా విల విలా
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గలా గల గలా గల గలా
ప్రతి ఉదయం నీల నవ్వే సొగసుల జోలా
ప్రతి కిరణం నీలా వాలే వెలుగుల మాలా
అంతగా నచ్చానా ఆశలే పెంచానా
గొంతు కలపనా గుండె తడపనా
నిన్నలా వచ్చానా రేపుగా మారానా
ప్రేమ తరపునా గీత చెరపనా
ఎంత దూరాన నీవున్నా నీతోనే నే లేనా
నా ఊపిరే నీ ఊసుగా మారిందంటున్నా
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విలా విల విలా విల విలా
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గలా గల గలా గల గలా
ఎందుకో ఏకాంతవేళా చెంతకే రానందీ వేళ
గాలిలో రాగాలమాలా జంటగా తోడుంది నీలా
నీ ఊహలో కలా ఊగింది ఊయలా
ఆకాశవాణిలా పాడింది కోయిలా
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విలా
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గలా