మనసిచ్చిన మారాజే మనువాడిన శుభవేళ
మరుమల్లె బుగ్గలో సిగ్గు సింధూరమాయెనే
కళలిచ్చే పల్లకిలో కదిలొచ్చే దేవతలా
మా ఇంటి దీపమై మా వదినమ్మ వచ్చేనే
అన్నయ్య మనసు తోటలో పారిజాతమై
అనురాగ పరిమళాలే పంచింది సొంతమై
పొంగే ఆనందం తెచ్చే సంతోషం మా లోగిలి నిండెనే
వధువే బంగారం వరుడే తన సర్వం ఇది నూరేళ్ళ బంధమే