Choose a track to play

Single / Track
నిన్ను కన్న కనులే మెరిసెనుగా
కన్నపేగు మరలా మురిసెనుగా
నిన్నలన్ని వరమై కురిసెనుగా
గుండెలన్ని తేనెలో తడిసెనుగా
నేనే నిన్ను చెయ్యార పెంచని అమ్మ
నీవే కదా కోట్లాది అమ్మల ప్రేమ
పసివాడా పసివాడా
ఏళ్ళెదిగిన పసివాడా
కలలాగా కలిసావే
నిన్నిక వీడెను గ్రహణపు నీడ
నిన్నటికి ఇప్పటికి
నీలో లేదే తేడా
పసినవ్వులు రువ్వినది
నీ పెదవులపై నీ మీసము కూడా
నిన్ను కన్న కనులే మెరిసెనుగా
కన్నపేగు మరలా మురిసెనుగా
నిన్నలన్ని వరమై కురిసెనుగా
గుండెలన్ని తేనెలో తడిసెనుగా
తడి తగలని పుడమికి నేడూ
చిరు చినుకే నీ రాకా
జనుమలో ఇది జన్మం
ఇక లోటేది నువు చేరాకా
రక్తబంధమొచ్చి బలమిచ్చాక
యుద్ధ విజయము ఖాయమికా
ఏ పొగరిటు రాగలదికా
మన చేతులు కలిసాకా
సద్దే లేనే లేని
నీరెండంటే నీవే
అలసిన గుండెల నిండా
నువు ఆనందాలను పొదిగావే
పసివాడా పసివాడా
ఏళ్ళెదిగిన పసివాడా
కలలాగా కలిసావే
నిన్నిక వీడెను గ్రహణపు నీడ
ఆహా ఇదేం వాస్తవం
కలలా ఉందే ఈ క్షణం
నాతో ఇలా ఉన్నది నీవేనా నిజమేనా
చెలియా నిన్నే కలవడం
కాలాలనే గెలవడం
కనుపాపలో కాంతిగా
నీవేనా నిజమేనా
చిరునామా తెలిసిన చిలకల్లే
ఎదగూటిలో వాలావే
కాలం కదలికలేవైనా
నిలిచావే నీలానే
పోదా పసివారై నిన్నల్లోకి
ఉందా ఆ చోటే మనం ఎన్నటికీ
నిన్ను కన్న కనులే మెరిసెనుగా
కన్నపేగు మరలా మురిసెనుగా
నిన్నలన్ని వరమై కురిసెనుగా
గుండెలన్ని తేనెలో తడిసెనుగా