Elige una pista para reproducir
పడగల గొడుగున
పుడమిని పొదిగిన
స్వామీ ఇక లేరా
పడగలు పరిచిన
తనువున హరి గల
తండ్రీ దిగిరారా
ఫణిరాజ పాహి పాహి
పరమేశ కంఠ హార ధీర నన్నే కావరా
శరణురా కరుణతో కదలిరా
శరణురా కరుణతో కదలిరా
పడగల గొడుగున
పుడమిని పొదిగిన
స్వామీ ఇక లేరా
పడగలు పరిచిన
తనువున హరి గల
తండ్రీ దిగిరారా
నరనరాలలో నటనమాడిన
ఉసురే నీదిరా
శిరల ధమనుల పొరలి పొంగిన
ఉరుకే నీదిరా
విషము కక్కిన విధికి చిక్కి
నే బలి కాలేనురా
వేయి పడగల వేద పనసల
వెలుగై బ్రోవరా
ఆ పాలకడలినే దాటి
శాపాలు కడగరావేల
తుడవరా నా పాపం
నిలపరా నా ప్రాణం
ఓ అనంత ఆదిశేషా
నీవే దిక్కురా
పడగల గొడుగున
పుడమిని పొదిగిన
స్వామీ ఇక లేరా
పడగలు పరిచిన
తనువున హరి గల
తండ్రీ దిగిరారా
అలనాటి గ్రహపాటు గతజన్మ కాటు
పగచాటు అగచాటు ఈ పాము కాటు
కుండలిని కుబుసమును ఖండించుకొనిరా
అతివక్ర విషచక్ర మండలము విడిరా
అధిపతివి అభలగతి నీవే
కులపతివి విమలమతి నీవే
రా దేవరా సర్వ భూధారాభోగేశ్వరా
హే ధీవరా సర్వకంటాగ్రహారేశ్వరా
కావరా బ్రోవరా