Elige una pista para reproducir
శ్రీ రంగధామేశ్వరీ జనని శ్రీలక్ష్మీ భార్గవీ
శ్రీ రంగధామేశ్వరీ జనని శ్రీలక్ష్మీ భార్గవీ
చిరుకరుణతో మమ్మేలుకో
పాలించుమా మా తల్లి
శ్రీ రంగధామేశ్వరీ జనని శ్రీలక్ష్మీ భార్గవీ
చిరుకరుణతో మమ్మేలుకో
పాలించుమా మా తల్లీ
త్రిలోక వాసిని శ్రీలక్ష్మీ
రవ్వంత జాలితో రక్షించుమా
కనకగిరీశ్వరి భగవతీ
కొలువుండు మా ఇంట గ్రుహ లక్ష్మివై
లాలించి పాలించు గజలక్ష్మివై ||
హరిహర విరించి
పూజిత సేవిత
మునిగణ వందిత
సద్గుణ వర్షిణి
మంజుల భాషిణి
వైదిక రూపిణి
అంబుజ వాసిని
హరి సుహాసిని
మము
లాలించి ఆడించు
శ్లాఘింతు నిను తల్లి
నీనామ స్మరణమ్మే అను నిత్యము
కరుణించవా అమ్మా మము కాపాడవా అమ్మా
కరుణించవా అమ్మా మము కాపాడవా అమ్మా
నమో హరి ప్రియ సుధా రస తనయ నమో రమాయై నమో నమో
నమో హరి ప్రియ సుధా రస తనయ నమో రమాయై నమో నమో
మంత్ర స్వరూపిణి
మంగళదాయని
జ్ఞాన వికాసిని
శాస్త్రనుతే
భవ భయ హారిణి
దుర్గతి నాశిని
మోక్ష ప్రదాయని
వేదమయే
మము
మురిపించి పోషించు
దయ చూపవా తల్లి
నీ పాద ధ్యానమ్మే అనవ్రతము
కరుణించవా అమ్మా మము కాపాడవా అమ్మా
కరుణించవా అమ్మా మము కాపాడవా అమ్మా
నమో హరి ప్రియ సుధారస తనయ నమో రమాయై నమో నమో
నమో హరి ప్రియ సుధారస తనయ నమో రమాయై నమో నమో
శ్రీ రంగధామేశ్వరీ జనని శ్రీలక్ష్మీ భార్గవీ
చిరుకరుణతో మమ్మేలుకో
పాలించుమా మా తల్లి పాలించుమా మా తల్లి పాలించుమా మా తల్లి