Elige una pista para reproducir
ఏమి మోసుకొచ్చావే కొత్త ఉగాది
శుభవార్తలు తెచ్చావా సుఖాలనందిస్తావా
మనుషులంతా ఒక్కటిగా మసలేట్టు చేస్తావా
ఏమి మోసుకొచ్చావే కొత్త ఉగాది
నులివెచ్చని సూరీడు….
ఆ……… ఆ……..
నులివెచ్చని సూరీడు వెలుగులు విరజిమ్మగా
ఆ వెలుగులో లే చిగురులన్నీ ముత్యమల్లే మెరసి మురిసే
పుడమితల్లి పులకింత మాలో ఏదో కొత్త వింత
పుడమితల్లి పులకింత ఏదో కొత్త వింత
అప్పుడు తెలిసిందిఅది ఉగాదియని, తెలుగు వత్సరమని, అది తెలుగుల తొలి పండగని
ఏమి మోసుకొచ్చావే కొత్త ఉగాది
శుభవార్తలు తెచ్చావా సుఖాలనందిస్తావా
మనుషులంతా ఒక్కటిగా మసలేట్టు చేస్తావా
ఏమి మోసుకొచ్చావే కొత్త ఉగాది
మావి చివురులను మేసి మదమెక్కిన కోయిల
వసంత రాగమాలపించ మైమరచెను ప్రకృతి
మామిడి తోరణాలు ముంగిట ముగ్గుల్లు వేసి
చైత్ర రథం తోనే నీకు స్వాగతాలు పలికేము
ఏమి మోసుకొచ్చావే కొత్త ఉగాది
శుభవార్తలు తెచ్చావా సుఖాలనందిస్తావా
మనుషులంతా ఒక్కటిగా మసలేట్టు చేస్తావా
ఏమి మోసుకొచ్చావే కొత్త ఉగాది
కాలచక్ర భ్రమణం లో….
ఆ…….. ఆ…………
కాలచక్ర భ్రమణంలో ఏటికి ఋతువులు ఆరు
అనుభవాల సారమైన రుచులు కూడా ఆరే
తీపీ, వగరు, చేదు, పులుపు కలగలసిన పచ్చడి రుచి
జీవితాన కష్టసుఖం పంచుకునే పరమార్థం
ఓ నూతన వత్సరమా..
తెలుగుదనపు సంబరమా
మధుమాసపు మమతలతో నిండుగా దీవించుమమ్మ..
నిండుగా దీవించుమమ్మా..
నిండుగా దీవించుమమ్మా…