Elige una pista para reproducir
సందేళ కూసుని నిన్ను తలసుకుంటుంటే
సందేళ కూసుని నిన్ను తలసుకుంటుంటే
సల్లన్ని సిరుగాలి గిలిగింత లెడుతుంటే
సందేళ కూసుని నిన్ను తలసుకుంటుంటే
సల్లన్ని సిరుగాలి గిలిగింత లెడుతుంటే
మనసంత ఎంతో గుబులాయరా మావా
మనసంత ఎంతో గుబులాయరా మావా
గుబులాయరా మావా గుబులాయరా మావా
సందేళ కూసుని నిన్ను తలసుకుంటుంటే
అలసిన సూరీడు ఇల్లు సేరినాడు
నీలాల నింగిలో మెరిసేను నెలవంక
అలసిన సూరీడు ఇల్లు సేరినాడు
నీలాల నింగిలో మెరిసేను నెలవంక
నీకూ నాకూ మధ్యన అడ్డొచ్చే ఆషాడం
నీకూ నాకూ మధ్యన అడ్డొచ్చే ఆషాడం
నీ ఊసు గురుతొచ్చి గుబులాయరా మావా
గుబులాయరా మావా గుబులాయరా మావా
సందేళ కూసుని నిన్ను తలసుకుంటుంటే
కొప్పులో మల్లెలు ఇంపుగా మురిసేను
కళ్లల్లో సూపులల్లో తోరణాలు సేసెను
కొప్పులో మల్లెలు ఇంపుగా మురిసేను
కళ్లల్లో సూపులల్లో తోరణాలు సేసెను
మది నిండ నీ రూపు
యదలో తావు ఉంటేను
మది నిండ నీ రూపు
యదలో తావు ఉంటేను
మనసంత ఎంతో గుబులాయరా మావా
గుబులాయరా మావా గుబులాయరా మావా
సందేళ కూసుని నిన్ను తలసుకుంటుంటే
సల్లన్ని సిరుగాలి గిలిగింత లెడుతుంటే
సందేళ కూసుని నిన్ను తలసుకుంటుంటే
సల్లన్ని సిరుగాలి గిలిగింత లెడుతుంటే
మనసంత ఎంతో గుబులాయరా మావా
గుబులాయరా మావా గుబులాయరా మావా