Elige una pista para reproducir
॥పల్లవి॥ కందువ రేపల్లె లోనే కానవచ్చె నీ సుద్దులు
అందుకొని పొగడ నిన్నలవి గాదు
॥చ1॥ వారికి వారికి నీవు వలచినట్టున్నాఁడవు
యీ రీతి నీ జాణతన మెటువంటిదో
కోరి నీ వెందరినై నాఁ గొలువు సేయించు కొందు
చేరి నీ యోపిక యెంతో చెప్పరాదు
॥చ2॥ భావింప నెవ్వరికైనా పక్కనున్నట్టు న్నాఁడవు
తావగు నీ విటరాయతన మెట్టిదో
వేవేలు సతులతోడ వేసారక మాటాడుదు
యేవల్లా నీ నేరుపు యెంచరాదు
॥చ3॥ అందరికౌఁగిటఁ గూడి నట్లానే వున్నాఁడవు
అందిన నీ చుట్టరిక మది యెంతో
అందపు శ్రీ వేంకటేశ అలమేల్మంగను నేను
పొందితివి నీగుణాలు పొగడరాదూ