Elige una pista para reproducir
శంభో శంకర
హర హర మహాదేవ
హర హర మహాదేవ
హర హర మహాదేవ
హర హర మహాదేవ
తద్ధింతా ధింధిమి
పరుల తాండవకేళి తత్పరా
గౌరీమంజుల సింజనీ జతుల లాస్య
వినోదవ శంకర
భరత వేధముగ నిరత నాట్యముగ
కదిలిన పాదమిది ఈసా
శివ నివేదనగ అవని వేదనగా
పలికెను పదము పరేశా
నీలకంఠరా జాలిపొందరా
కరుణతో నను గనరా
నీలకంఠరా శైలమందిరా
మోరవిని బదులిదరా
నగజా మనోజ జగదీశ్వరా
మాలేండు శేఖర శంకర
భరత వేధముగ నిరత నాట్యముగ
కదిలిన పాదమిది ఈసా
శివ నివేదనగ అవని వేదనగా
పలికెను పదము పరేశా
హర హర మహాదేవ
హర హర మహాదేవ
హర హర మహాదేవ
హర హర మహాదేవ
హా అంతకాంత నీ సతి
అగ్నితప్తమైనది
మేను త్యాగమిచ్చి తాను
నీలో లీనమైనది
ఆదిశక్తి ఆకృతి అద్రిజాత పార్వతి
తాణువైన ప్రాణధవుని
చెంతకు చేరుతున్నదీ
భవుని భువుకి తరలించేలా
ధరణి దివిని తలపించేలా
రస తరంగిణీ లీల యతిని
నృత్యరతులు చేయగలిగే ఈ వేళా
భరత వేధముగ నిరత నాట్యముగ
కదిలిన పదమిది ఈసా
శివ నివేదనగ అవని వేదనగా
పలికెను పదము పరేశా
జంగమ సావర గంగాచ్యుత శిర
బృత మండుతకర పుర హరా
భక్త శుభంకర భవనా శంకర
స్వరహర దక్షాత్వర హర
పాలవిలోచన పాలిత జనగణ
కాల కాల విశ్వేశ్వర
ఆసుతోషా అధనాశ వినాషణ
జయగిరీశ బృహదీశ్వర
హర హర మహాదేవ
హర హర మహాదేవ
వ్యోమకేశ నిను హిమగిరి వరసుత
ప్రేమ పాశమున పిలువంగ
యోగివేష నీ మనసున
కలగదా రాగలేశమైనా
హే మహేశా నీ బయదపదాహతి
దైత్య శోషణము జరుపంగా
భోగిభూష భువనాళిని
నిలుపవ అభయ ముద్రలోన
నమక చమకముల నాదాన
యమక గమకముల యోగాన
పలుకుతున్న ప్రాణాన ప్రణవనాధా
ప్రధమనాధ శృతి వినరా
హర హర మహాదేవ