Elige una pista para reproducir
ఎంత చిత్రం కదా ఒక చూపుకే ఒరిగిపోయా
ఎంత ఘోరం కదా ఒక నవ్వుకే ఒదిగిపోయా
తప్పు ఒప్పు ఆలోచించే వీలే లేదాయె
తప్పనిసరిగా తిప్పలు వచ్చే ప్రేమే వరదాయే
ఈ ముప్పును తప్పుకుపోయే వేరే దారే కనపడదాయే
ఎంత చిత్రం కదా ఒక చూపుకే ఒరిగిపోయా
ఎంత ఘోరం కదా ఒక నవ్వుకే ఒదిగిపోయా
కంటి వైపు రానంది కునుకు
కత్తి మీద సామయింది బతుకు
గుండెల్లోన పుట్టింది ఒణుకు
గొంతు దాడి రానంది పలుకు
ఓరి దేవుడో ఇంత కోపమా నాపైన నీకు
చెప్పాలంటే అంత సులభమా శక్యినివ్వు నాకు
ఒక ఒక్క పూటైన నేను ఓర్చుకోగలనా
ఏదేమైనా ఏదో ఒకటి చెప్పేస్తా తనకు
ఎంత చిత్రం కదా ఒక చూపుకే ఒరిగిపోయా
ఎంత ఘోరం కదా ఒక నవ్వుకే ఒదిగిపోయ
ముల్లై గుచ్చిపోయింది సొగసు
ఒళ్ళే మరచిపోయింది మనసు
ఉన్నట్టుండి లేచింది వయసు
ప్రేమొ పిచ్చొ నాకేమి తెలుసు
ఎంత ఆపిన ఆగనంది దూకే అడుగు
ఎంత దూరమొ తెలియకున్నది తుళ్ళే పరుగు
తన తీరమేదైన ఏ దారిలోనైనా
చేరే వరకు అలుపే లేదు పట్టేస్తా తుదకు
ఎంత చిత్రం కదా ఒక చూపుకే ఒరిగిపోయా
ఎంత ఘోరం కదా ఒక నవ్వుకే ఒదిగిపోయా
తప్పు ఒప్పు ఆలోచించే వీలే లేదాయె
తప్పనిసరిగా తిప్పలు వచ్చే ప్రేమే వరదాయే
ఈ ముప్పును తప్పుకుపోయే వేరే దారే కనపడదాయే
ఎంత చిత్రం కదా ఒక చూపుకే ఒరిగిపోయా
ఎంత ఘోరం కదా ఒక నవ్వుకే ఒదిగిపోయా