Elige una pista para reproducir
నీతోనే నీతోనే ఉండాలనిపిస్తోంది
నూరేళ్లు నీ కంటిపాపలా
ఈ మాటే ఇంకోసారందామనిపిస్తోంది
వింటావో చంటిపాపలా
నా అడుగైనా నీతోనే
పరుగైనా నీతోనే
నా ఊపిరి నువ్వే అంటానే
నా కలలన్నీ నీతోనే
కథలన్నీ నీతోనే
కడదాకా కలిసి ఉంటానే
ఒకటా రెండా మూడా
ఎన్నో ఎన్నో ఊహల్లోన
నన్నే అందంగా ఊగిస్తున్నావే
ఒకటా రెండా మూడా
లెక్కేలేని రంగుల్లోన
మనసంతా ముంచేస్తున్నావే
నీ చూపులతో ఈ చీకటంతా వెలిగించావే
సూర్యుడితో అవసరమే లేనంతగా
నీ నవ్వులతో పగలేమో వెన్నెల కురిపించావే
జాబిల్లే కుళ్ళుకు చచ్చేటంతగా
మాటలతోనే నన్ను మాయే చేస్తావే
కనులే కలిపేసి కొంటె కలలు తెస్తావులే
పిచ్చనిపించే ప్రేమలో మత్తు నాలో కూడా నింపేసావే
ఈ ఈ ఈ క్షణమే
ఒకటా రెండా మూడా
ఎన్నో ఎన్నో ఊహల్లోన
నన్నే అందంగా ఊగిస్తున్నావే
ఒకటా రెండా మూడా
లెక్కేలేని రంగుల్లోన
మనసంతా ముంచేస్తున్నావే
ఒకటవుదామా మనలాంటి
ఇంకో జత లేదంటూ
విడదీద్దామన్న విడిపోనంతగా
కలిసుందామా మనలోకమేదో మనదేనంటూ
మన మధ్యకి ఎవరూ రాలేనంతగా
నువ్వు చెప్పినవన్నీ నా మనసే వింటోంది
కనుకే నీ వెనకే కొత్త పరుగు తీస్తున్నది
ఇద్దరి ఊపిరి ఒక్కటయ్యాక ఇంతకుమించిన వరమేముంది
హ హ బావుందీ
ఒకటా రెండా మూడా
ఎన్నో ఎన్నో ఊహల్లోన
నన్నే అందంగా ఊగిస్తున్నావే
ఒకటా రెండా మూడా
లెక్కేలేని రంగుల్లోన
మనసంతా ముంచేస్తున్నావే