Elige una pista para reproducir
పిల్లా నీ కళ్లకున్న కాటుకేమొ సూపరే
తల్లోన ఎట్టుకున్న మల్లెపూలు సూపరే
బత్తాయి పళ్ళులాంటి బుగ్గలేమొ సూపరే
బొడ్లోన దోపుకున్న చీరకొంగు సూపరే
నడుమట్ట తిప్పుతుంటే నడుమట్ట తిప్పుతుంటే నడుమట్ట తిప్పుతుంటే నువ్వు సూపరే
నీ జడగంట లూగుతుంటే ఎంత సూపరే
కుర్రాడు పెట్టుకున్న కళ్ళజోడు సూపరే
పైకెత్తి కట్టుకున్న గళ్ళ లుంగీ సూపరే
మెడ్లోన ఏసుకున్న గోల్డ్ చైన్ సూపరే
గుండీల ఎనక ఉన్న గుండె దమ్ము సూపరే
మీసాన్ని తిప్పుతుంటే మీసాన్ని తిప్పుతుంటే మీసాన్ని తిప్పుతుంటే నువ్వు సూపరే
నీ వేషాలు చూడబోతే ఎంత సూపరే
నీ చేతి గాజులు నీ కాలి మువ్వలు గుండెల్లో గోలిసోడ కొట్టెనే
నీ గోరు చిక్కుడు నీ గోరు గిచ్చుడు తమాష తిమ్మిరేదొ పుట్టెనే
నీ బుగ్గ సొట్టలు వెయిస్తు లొట్టలు ఒలమ్మో గింగిరాలు తిప్పెనే
నా చంప నొక్కులు నీ సర్వ హక్కులు నా సిగ్గు అటక మీద ఎక్కెనే
నీ జబ్బల్ రైక చూసి వస్తినే పొద్దు పొద్దున్న సంతకెళ్లి తెస్తినే
నీ జబర్దస్తు నేను చూస్తినే ఓ రబ్బా వాయనాలిస్తినే
పిక్కపైకి చీరకట్టి నీళ్ళబింది సంకనెట్టి చిత్తరాల సుప్పనాతిరా
నడుమట్ట తిప్పుతుంటే నడుమట్ట తిప్పుతుంటే నడుమట్ట తిప్పుతుంటే నువ్వు సూపరే
నీ జడగంట లూగుతుంటే ఎంత సూపరే
కుర్రాడు ఎట్టుకున్న కళ్ళజోడు సూపరే
పైకెత్తి కట్టుకున్న గళ్ళ లుంగీ సూపరే
పిల్లా నీ కళ్లకున్న కాటుకేమొ సూపరే
తల్లోన ఎట్టుకున్న మల్లెపూలు సూపరే
భారీ global mind ఒక్కసారి cute కళ్ళు కూడా తిప్పనంత crazy following ఉన్న పోరి rock me lady
పున్నాగ పువ్వులా దీవాళి జువ్వలా జవాని జిగ్ జిగ్ మన్నదే
అరిటాకు అందమే తాటాకు మంటలా నీ వల్ల భగ్గు భగ్గు మన్నదే
హే నీ వంపు సొంపులు కడియాలు మెట్టెలు గుమ్మెత్తి గుప్పు గుప్పు మన్నవే
తర్వాని కుండలా కుర్వాని విందులా నా ఈడు ఆవురావురన్నదే
నువ్వు పచ్చా పావడాయి వస్తివే పచ్చి పాల మీగడాయి తెస్తివే
ఆ కుర్ర ఆవకాయ చూస్తివే కొంగులాగి ఆగడాలు చేస్తివే
గంగరాల చెట్టుకాడ గంపనెత్తి కెట్టుకుంటు కైకలూరి కన్నెపిల్లలా
నడుమట్ట తిప్పుతుంటే నడుమట్ట తిప్పుతుంటే నడుమట్ట తిప్పుతుంటే నువ్వు సూపరే
నీ జడగంట లూగుతుంటే ఎంత సూపరే
కుర్రాడు ఎట్టుకున్న కళ్ళజోడు సూపరే
పైకెత్తి కట్టుకున్న గళ్ళ లుంగీ సూపరే
పిల్లా నీ కళ్లకున్న కాటుకేమొ సూపరే
తల్లోన ఎట్టుకున్న మల్లెపూలు సూపరే