Elige una pista para reproducir
కాపోల్ల ఇంటికాడ కలిసీ ఆడిన ఆట
పడుసోళ్లంత వచ్చి కూడి పాడిన పాట
మంచిగుండెరా నా మదిలొ ఉండెరా
ఎంతో మంచిగుండెరా బావ మనసు నిండెరా
కాపోల్ల ఇంటికాడా మనం కూడి ఆడిన పాట
ఆ పడుసూ జంటలన్ని కూడి పాడిన పాట
మంచిగుండెరా నా మదిలొ ఉండెరా
బావ మంచిగుండెరా నా మనసు నిండెరా
గొల్లోళ్ళింటికాడ గొర్లా మందలట
గొర్లపాల జున్ను కమ్మలగుంటదని
కొంటిమి కదా మనం తింటిమి కదా బావ కొంటిమి కదా మనం తింటిమి కదా
గొల్లోళ్ళింటికాడా అరె గొర్లా మందలట
గొర్లపాల జున్ను కమ్మలగుంటదని
కొంటిమి కదా మనం తింటిమి కదా
బావ కొంటిమి కదా మనం తింటిమి కదా
మేరోళ్ళింటికాడ పోతపోసిన రైక
మనసూ పడిన నాకు మంచీగుంటయని
కుట్టీపిస్తివి బావ పట్టుకొస్తివి నాకు కుట్టీపిస్తివి బావ పట్టుకొస్తివి
మేరోళ్ళింటికాడా పోతపోసిన రైకలన్నీ
నీకు మనసూ పడిన నాకు మంచీగుంటయని
కుట్టీపిస్తివి బావ పట్టుకొస్తివి నాకు కుట్టీపిస్తివి బావ పట్టుకొస్తివి
కుమ్మరోళ్ళ ఇంటికాడ మట్టీ కుండలట
అవ్వే మనకు బోళ్లు ముంతాలైతయని
ఎన్నో సెప్తివి నా ఎదను దోస్తివి బావ ఎన్నో సెప్తివి నా ఎదను దోస్తివి
కుమ్మరోళ్ళ ఇంటికాడా అరె మట్టీ కుండలట
అవ్వే మనకు బోళ్లు ముంతాలైతయని
ఎన్నో సెప్తివి ఇప్పుడేడ పోతివి బావ ఎన్నో సెప్తివి నా ఎదను దోస్తివి
ఓ బావో బంగరుకొండ మనసూలున్న మాట మంచీగిను మరి
నీకే సెప్పుతున్న మనువు జేసుకో నా మనసునేలుకో
నన్ను మనువు జేసుకో నా మనసునేలుకో
ఓ బావో బంగరుకొండా అరె మనసూలున్న మాటా
అరె మంచీగిను మరి నీకే సెప్పుతున్న మనువు జేసుకో
నా మనసునేలుకో నన్ను మనువు జేసుకో నా మనసునేలుకో