Elige una pista para reproducir
॥పల్లవి॥ ఏది గతి నే నొక్కఁడనే యెందరి కోపుదును
నీదయతో మన్నించఁగదవే నీరజనాభా
॥చ1॥ మోహాంధకారము యెక్కడచూచిన ముంచుకవున్నది
దేహాభిమానము అందుకుఁ దోడు దీకొనివచ్చీని
సాహసభూతము ఘనహింసలకే చాఁపించీఁ జేయి
దాహపుటాసలు వెనకముందరల తరవులువెట్టీని
॥చ2॥ కోపాగ్నికణములు సారెకుఁ జుట్టుక గుబ్బతిలఁ దొడఁగె
పైపై వయోవికారంబులు చలపట్టుక తిరిగీని
చాపల గర్వము యెవ్వరినైన సాధింపించీని
తీపుల ధనములు మీఁదిమీఁదనే తీదీపులు రేఁచీని
॥చ3॥ భావజవిలాస మప్పటప్పటికి బలుములు చూపీని
వేవేలు సంపద లెందుచూచినా వేడుకసేసీని
శ్రీవేంకటేశ యలమేల్మంగను చేకొను దేవుఁడా
యీవేళను నన్నేలితివి నిన్నియు తగ వసమయ్యీని