Elige una pista para reproducir
నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నే లేని మైమరపునా
ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో విన్న మాటేదో నిన్నడగనా

అలా సాగిపోతున్న నాలోన ఇదేంటిలా కొత్త ఆలోచన
మనసే నాది మాటే నీది ఇదేం మాయో ఇదేం మాయో
నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నే లేని మైమరపునా
ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో విన్న మాటేదో నిన్నడగనా
అవును కాదు తడబాటుని అంతో ఇంతో గడిదాటుని
విడివిడిపోని పరదాని పలుకై రాని ప్రాణాన్ని
ఎదంతా పదాల్లోన పలికేనా నా మౌనమే ప్రేమ ఆలాపన
మనసే నాది మాటే నీది ఇదేం మాయో ఇదేం మాయో
నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నే లేని మైమరపునా
ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో విన్న మాటేదో నిన్నడగనా
దైవం వరమై దొరికిందనీ నాలో సగమై కలిసిందనీ
మెలకువకాని హృదయాన్ని చిగురైపోని శిశిరాన్ని
నీతో చెలిమి చేస్తున్న నిమిషాలు నూరేళ్ళుగా ఎదిగి పోయాయిలా
మనమే సాక్ష్యం మాటే మంత్రం ప్రేమే బంధం