Elige una pista para reproducir
నీలి కనుమల్లో
నీటి అలలే పడవలుగా
తేలి వెళుతున్నా
పూల ఘుమ ఘుమలు
గాలి గుస గుసలు
తెలిపే కథలవుదాం
కొంటె కిల కిలలు
కొత్త కువ కువలు
పరులెవరు వినరందాం
ఇద్దరి ఏకాంతం
మన ఒక జతకే సొంతం
చెట్టు కొమ్మలలో
గువ్వ జంట మనం
గుండె సవ్వడిలో
విన్నాం ఓ పరికరం
కిచ్ కీచ్చన్నది వచ్చి పొంమ్మనది
ముచ్చటేదో మరి పిట్ట భాష అది
కిచ్ కీచ్చన్నది వచ్చి పొంమ్మనది
ముచ్చటేదో మరి పిట్ట భాష అది
ఒక చిరు చినుకు
ఇలకు జారి ఇలా అలకిడిలో
చేరే కబురేదో
కిచ్ కీచ్చన్నది వచ్చి పొంమ్మనది
ముచ్చటేదో మరి పిట్ట భాష అది
ఎన్నెన్ని కలలు
కనుపాపల లోగిలిలో వాలినవో
ఆ కలలసలే లోకంలో
ఇన్నాళ్లు కొలువుండేవో
అడగాలో మానాలో
నీలి కనుమల్లో
నానననానా ననానననా
జతలోన జగతిని మరచి
గడిపే మనని చూసి
ఆకాశమే పిలిచింది మేఘాలు పరిచింది
కిచ్ కీచ్చన్నది వచ్చి పొమ్మంనది
ముచ్చటేదో మరి పిట్ట భాష అది
కిచ్ కీచ్చన్నది వచ్చి పొంమ్మనది
ముచ్చటేదో మరి పిట్ట భాష అది
అలలుగ ఎగసిన తలపుల వేగం
ఇలవిడి ఎగిరిన చిలకల మైకం
మిలమిల మెరిసిన తొలకరి మేఘం
జలజల కురిసిన చినుకుల రాగం
అప్పుడలా గగన మెందుకు ఉరిమిందో
ఎందుకలా శరమై సమయం తరిమిందో
గుర్తే లేదు కదా ఎపుడు నాలో చేరావో
చెప్పనిలా నువ్వు నా చెయ్యి జారావో
గుండె తడుముకు చూస్తే
ఒట్టి శూన్యమే ఉందే
చిట్టి చిలకమ్మ నువ్వెప్పుడు
ఎలా వెళిపోయావే నన్నొదిలి
ఇంక ఎన్నాల వరకు
ఒంటి రెక్కై ఎగారాలి ఎగరాలి
అంతా క్షణంలో కథలా ముగిసిందా
నీతో ప్రతి నిమిషం
పగటి కల అయ్యిందా
మౌనం మనసులో
ఎంత అలజడి చేస్తుందో
మన జ్ఞాపకాల సంకెళ్ల నుండి
విడుదలనే అడగనని
అంతా క్షణంలో కథలా ముగిసిందా
నీతో ప్రతి నిమిషం
పగటి కల అయ్యిందా
మౌనం మనసులో
ఎంత అలజడి చేస్తుందో
మన జ్ఞాపకాల సంకెళ్ల నుండి
విడుదలనే అడగనని