Elige una pista para reproducir

జోలాలి జోలాలిరా
జోలాలి జోలాలిరా
హాయిగ నిదురించరా
నిను లాలించే నాకీ భాగ్యము
ఏ దేవత వరమో
నా మదిలో నీ రూపం
నా దైవమే నిలిపిరా
ఏ జన్మలో చేసిన పుణ్యమో
ఈ జన్మలో పండెరా
నిను కన్న ఓ తల్లిగా
జోలాలి జోలాలిరా
హాయిగ నిదురించరా
ఎంతో ఎదగాలిరా ఎన్నో గెలవాలిరా
నీ జాతి గర్వించగా
నీవే అదర్శమై నీవే ఒక దీపమై
ఈ చీకటిని తొలగించరా
నీ దారే రహదారి రా
మహ రాజుగ వెలగాలిరా
జోలాలి జోలాలిరా
హాయిగ నిదురించరా
కన్నా నీ కళ్లలో నానే కనిపించెరా
నా మనసు మురిపించెరా
చిన్నా మరు జన్మలో
నన్నే కని పెంచరా
నీ ఒడిలో లాలించరా
ఆ సాయి కరుణించురా
మన బ్రతుకు చిగురించురా
జోలాలి జోలాలిరా
హాయిగ నిదురించరా
నిను లాలించే నాకీ భాగ్యము
ఏ దేవత వరమో