Elige una pista para reproducir
కు కు కు కు కూ
కొమ్మరెమ్మ పూసే రోజు
కు కు కు కు కూ
ప్రేమ ప్రేమ పుట్టిన రోజు
నిదురించే ఎదవీణ కదిలే వేళలో
మామిడి పూతల మన్మధ కోయిల
కు కు కు కు కూ
కొమ్మరెమ్మ పూసే రోజు
స్వరాలే వలపు వరాలై
చిలిపి శరాలై పెదవి కాటేయగా
చలించే స్వరాలే
వలచి వరించే వయసు వరాలే
ఎదలు హరించే చిలిపి శరాలై
కలలు పండించగా
గున్న మావి గుబురులో కన్నె కోయిలమ్మ
తేనె తెలుగు పాటై పల్లవించవమ్మ
మూగబాసలే ముసి ముసి ముసి ముసి
ముద్దబంతులై విరియగా
సామగ సనిదని
సామగ సనిదని
సామగ సామగ సామగ సామగ
సా పదసని నీ గసరిద ద సనిదమ
మా నిదమగ గ గమగమ దని
సాగేదెపుడు నీ పేదవుల దారి విడిచి
మార్గశిరపు గాలులు మురళిగా
విన్న వేళ కన్నె రాధ పులకించే
కు కు కు కు కూ
కొమ్మరెమ్మ పూసే రోజు
కు కు కు కు కూ
ప్రేమ ప్రేమ పుట్టిన రోజు
ఫలించే రసాలే
తరిచి తరించే పడుచు నిషాలో
కవిత లిఖించే యువత పేదాల
సుధలు పొంగించగా
సన్న జాజితొడిమలో చిన్ని వెన్నెలమ్మ
సందె వెలుగులోనే తానమాడునమ్మ
కన్నె చూపులే కసి కసి కసి కసి
కారు మబ్బులై ముసరగ
సామగ సనిదని
సామగ సనిదని
సామగ సామగ సామగ సామగ
సా పదసని నీ గసరిద ద సనిదమ
మా నిదమగ గ గమగమ దని
సాయమడుగు నీ పరువము దాగ దిపుడు
మాఘ నెలల గాఢపు మమతల
పూలు కోసి మాలు కోసు పలికించే
కు కు కు కు కూ
కొమ్మరెమ్మ పూసే రోజు
కు కు కు కు కూ
ప్రేమ ప్రేమ పుట్టిన రోజు