మందార మకరంద మాధుర్యమునదేలు
మధుపంబు ఓవునే మదనములకు
నిర్మల మందాకినీ వీచికలదూగు
రాయంచ చనునే తరంగిణులకు
లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు
కోయిల చేరునే కుటజములకు
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబు
అరుగునే సాంద్ర నీహారములకు
అంబుజోదర దివ్య పాదారవింద
చింతనామృతపాన విశేషమత్తచిత్తము
ఏ రీతి ఇతరంబు జేరనేర్చు
వినుత గుణ శీల
మాటలు వేయునేల