Elige una pista para reproducir
॥పల్లవి॥ ఎందువోయితి విందాఁకా యెక్కడనుండె నీనేర్పు
బందెకు నప్పుడాతని పట్టుకుండవలదా
॥చ1॥ నేనాతనితో నవ్వితే నీకేలే చింత
నాననిచ్చి నీవూఁ గొంత నవ్వరాదా
సానఁబెట్టె(ట్ట?)తఁడు చూపు జళిపించేయపుడు
మానుపరాదా నీమగని సన్నలను
॥చ2॥ చెక్కాతని నేనొక్కితే చిమిడేవదేమే
చిక్కనిచ్చి నీవూఁ జేఁత సేయరాదా
మక్కువ నాతఁడు నామర్మమంటేయపుడు
నిక్కి కోపగించరాదా నీపతినెమ్మెలను
॥చ3॥ కలసితే నీవితని గద్దించే వెవ్వతవే
వలసినప్పుడు నీవూ వంచుకోరాదా
యెలమి శ్రీవెంకటేశుఁ డెలయించేయపుడు
వలపించి నీవిభుఁని వంకలొత్తరాదా