Elige una pista para reproducir
॥పల్లవి॥ ఇంతేసి పారుపత్తే లేమీ నీకు
అంతంతకు గరిసించే వత్తునా నే నీకు
॥చ1॥ కూడఁ బారివచ్చి నా కుల మేల యడిగేవు
వేడుకకాఁడ నాతో వియ్య మందేవా
నాడొడివటనె నాప రే లడిగేవు
చేడెలపైఁ బద్దేలు చెప్పుదువో నీవు
॥చ2॥ సరసానఁ జెయివట్టి సత్తు వేమి చూచేవు
బిరుదుకు నాతోడఁ బెనఁ గేవా
సొరిది నాపై నోరచూప లేమి చూచేవు
తిరిగి తిరిగి వంక దిద్ద వచ్చేవా
॥చ3॥ముద్దు ముద్దువలె నాకు మొక్కు లేమి మొక్కేవు
కొద్దిమీర నీవు నన్నుఁ గోలిచేవా
అద్దొ మండెమురాయఁడవై నన్నుఁ గూడితివి
గద్దరివైన శ్రీవెంకటనాథుఁడా