Elige una pista para reproducir
॥పల్లవి॥ సందేహ మెక్కడా లేదు సంతోషించు కొంటి నేను
కందువ బ్రహ్మానందము గైకొంటి నేను
॥చ1॥నున్నఁగా సంకీర్తన నా నోరి కిచ్చితి గనక
నన్ను రక్షింతువే యనుచు నమ్మితి నేను
పిన్ననాఁడె నీవు నన్నుఁ బేరుకొంటివి గనక
యెన్నఁగ నీడేర్తు వని యియ్యకొంటి నేను
॥చ2॥శ్రీకాంతుఁడ నీ మూర్తి నా చిత్తములో నిల్పఁగాను
నాకు నీవు గలవని నమ్మితి నేను
దాకొని లోకములో నీ దాసుఁడనిపించఁగా
యీకడ నేలితివని యెఱిఁగితి నేను
॥చ3॥కైవసమై నీవు నాకు కలలో నానతియ్యఁగా
నావద్ద నున్నాఁడ వని నమ్మితి నేను
యేవేళా శ్రీవేంకటేశ యెదుటనే వుండఁగాను
పావనమైయిన్నిటాను ప్రబలితి నేను