Elige una pista para reproducir
Sencillo / Pista
కాపోల్ల ఇంటికాడ కామూడాటల పడుసోళ్లంత వచ్చి ఆడుకుంటరట
ఆడబోదమా బావ సూడబోదమా మనం ఆడబోదమా బావ సూడబోదమా
కాపోల్ల ఇంటికాడా అరె కామూడాటలటా పడుసోళ్లంత వచ్చి ఆడుకుంటరట
ఆడబోదమా బావ సూడబోదమా మనం ఆడబోదమా బావ సూడబోదమా
జాలూ తండలోన తీజు పండుగట జనాలంత గూడి జాతర జేస్తరట
కూడిబోదమా బావ సూడబోదమా మనం కూడిబోదమా బావ సూడబోదమా
జాలూ తండలోనా అరె తీజు పండుగట జనాలంత గూడి జాతర జేస్తరట
కూడిబోదమా బావ సూడబోదమా మనం కూడిబోదమా బావ సూడబోదమా
శాలోళ్ల ఇంటికాడ సక్కాని సీరాలట సీరకూదగ్గ రైకపోతాలు పోస్తరట
పొయ్యి వస్తవా బావ గొని తెస్తవా నువ్వు పొయ్యి వస్తవా నాకు గొని తెస్తవా
శాలోళ్ల ఇంటికాడా అరె సక్కాని సీరాలటా సీరకూదగ్గ రైకపోతాలు పోస్తరట
పొయ్యి వస్తవా పోతల్ల రైక తెస్తవా నాకు పొయ్యి వస్తవా పోతల్ల రైక తెస్తవా
బెస్తోళ్లింటీకాడ ఒట్టీ శాపాలట ఒట్టి సేపల కూర గట్టీగుంటదట
వండిపెడతరా నీకు తినపెడతరా బావ వండిపెడతరా నీకు తినపెడతరా
బెస్తోళ్లింటీకాడా అరె ఒట్టీ శాపాలటా ఒట్టి సేపల కూర గట్టీగుంటదట
వండిపెడతరా నీకు తినపెడతరా నేను వండిపెడతరా నీకు తినపెడతరా
పెసరు బండ మీదా అరె ప్రేమా జంటలటా ఆ ప్రేమాగల్ల మాట సెప్పుకుంటరట
గూడిబోదమా బావ సూడబోదమా మనం కూడిబోదమా బావ సూడబోదమా
పెసరు బండ మీదా అరె ప్రేమా జంటలటా ఆ ప్రేమాగల్ల మాట సెప్పుకుంటరట
గూడిబోదమా బావ సూడబోదమా మనం కూడిబోదమా బావ సూడబోదమా