Elige una pista para reproducir
పల్లవి
ఎంత చవుక జేసినే సకియ నేడెంత
కంతుని గన్న చ - క్కని వేణుగోపాలు డెంత
అనుపల్లవి
సంతము న గూడి యా - సకిని ముద్దిడి నోడట
ఎంత
చరణం
చిన్న మోమున మోము - జేర్చి మోవి నొక్కునే -
యెన్నెన్నో వగల సొక్కించునే
వపొన్చపువ్వులు దెచ్చి - పొలతి గైకొమ్మను
పన్చగ శయనుడు యా - కన్నె బోధన వినెనే
ఎంత
చరణం
పదము బాడుచుండ - సదయుడు తనుమెచ్చి
మదనకేళిగూడు - మమత డాల్చెనే
అది తెలిసి యా చేటి - పదురుకొనుచు వచ్చి
మది కలత జేసెనే - మగువ నేనెటుల సయితునే /ఎంత//