Elige una pista para reproducir
Sencillo / Pista
అయ్యారే అయ్యారే గుండెల్లో గుచ్చే ముళ్ళు
కాజేసేయ్ న హృదయం గంజాయి మత్తు కళ్ళు
అయ్యారే అయ్యారే గుండెల్లో గుచ్చే ముళ్ళు
కాజేసేయ్ న హృదయం గంజాయి మత్తు కళ్ళు
ఆ కళ్ళకు లక్ష తెచ్చి ఇస్తాలే
ఆ ఈడుకు ఆస్తి రాసి ఇస్తాలే ముద్దిస్తావా ఓహో
ఈ కులుకే ఈ తళుకే గుండెల్లో గుచ్చే ముళ్ళు
కాజేసేయ్ నీ హృదయం గంజాయి మత్తు కళ్ళు
ఈ కళ్ళకు లక్ష సరిపోదయ్యా
నా ఈడుకు ఆస్తి సాటి రాధయ్య కాస్త ఆగయ్యా
అరేయ్ నీ ఊరు కృష్ణాపురం నా ఊరు రామాపురం రెండూళ్ళు చాలా దగ్గరలేయ్
ఈ రాదమ్మకు కృష్ణుడు నేనై సీతమ్మకు రాముడు నేనై బతుకంతా నీతో ఉంటాలేయ్
వాడిపోనీ అందము నీది వీడిపోని బంధము మనది
ముచ్చటైన జంటిది వెయ్యిఏళ్ల పంటిది
సన్నజాజి పూలు విరిసి కెన్నీ మోజు మురిసి మురిసి
కళ్ళు రెండు కలిసేనే తేనె జల్లు కురిసెనే
తియ్యనైన మొహం పెంచకీ గుచ్చి నన్ను దూరముంచకే
నువ్వు మాయేదో చేసేసావే నా ప్రాణం తీసేసావే కన్నేసి నన్నే దోచవే
ఈ అందాల ముద్దుగుమ్మ నావొళ్ళో పడ్దాదమ్మా నా దైవం ఎపుడు మన్మధుడే
ఈ కులుకే ఈ తళుకే గుండెల్లో గుచ్చే ముళ్ళు
కాజేసేయ్ నీ హృదయం గంజాయి మత్తు కళ్ళు
కళ్ళల్లోకి జారీ జారీ కళ్ళల్లోకి దూరి దూరి నా గుండెయ్ దోస్తివే ఎం చేయ వస్తివే
అమ్ము వేసి గాయం చేయకు చోపాపు వేసి కళ్ళు మూయకు
నీ మేనంతా సింగారమే మెరిసేటి బంగారమే ఎండల్లో వచ్చిన వెన్నెలవే
ఇక జరిగేది కళ్యాణమే బతుకంతా వైభోగమే ముద్దుల్లో వేయి ముచ్చటలేయ్
అయ్యారే అయ్యారే గుండెల్లో గుచ్చే ముళ్ళు
కాజేసేయ్ న హృదయం గంజాయి మత్తు కళ్ళు
ఈ కళ్ళకు లక్ష సరిపోదయ్యా నా ఈడుకు ఆస్తి సాటి రాధయ్య కాస్త ఆగయ్యా
ఈ కులుకే ఈ తళుకే
కాజేసేయ్ నీ హృదయం గంజాయి మత్తు కళ్ళు