Elige una pista para reproducir

నీతోనే ఆగేనా సంగీతం బిళహరి నీతోనే ఆగేనా సంగీతం
బిళహరీ అని పిలువకుంటే స్వరవిలాసం మార్చుకుంటే ఆరిపోదు గానజ్యోతి
నీతోనే ఆగేనా సంగీతం
సాగరాల రాగహేల ఆగిపోయి మూగదౌన
సాగరాల రాగహేల ఆగిపోయి మూగదౌన
యుగయుగాలుగా జగాన దారి చూపగ
అనంతమైన కాంతి ధారపోసిన
అఖండమై ప్రబాకరుడు జ్వలించడా నిరంతరం
అఖండమై ప్రబాకరుడు జ్వలించడా నిరంతరం
నీతోనే ఆగేనా సంగీతం
విహంగ స్వనాల ధ్వనించురాగం ఏది
తరంగ స్వరాల జనించు గీతం ఏది
విహంగ స్వనాల ధ్వనించురాగం ఏది
తరంగ స్వరాల జనించు గీతం ఏది
గాలి గొంతు నేర్చుకున్న గానశాస్త్ర గ్రంధమేది ఏ జ్ఞానం ఆ నాదం
పేరులేక పేదదౌనా మ్రోగుతున్న వాన వీణ
పేరులేక పేదదౌనా మ్రోగుతున్న వాన వీణ
అహంకరించి సాగుతున్న వేళలో ఎడారిపాలు కాదా గానవాహిని
వినమ్రతే త్యజించితే విషాదమే ఫలం కదా
వినమ్రతే త్యజించితే విషాదమే ఫలం కదా
నీతోనే ఆగేనా సంగీతం
మగపద నీతోనే సరీగ రిగాప గపాద నీతోనే
సరిగ రిగప మగపద మగ రిగప గపద మగపదదరి నీతోనే
పాదమ గపద రిస రీగరి సనిదప ద దాసరిగ పాగసరి గాపదస రీగసరి సరిగపదరి నీతోనే
సరిగ పమగ రిగపమగరి సాస సాస రీరి రీరి సని ద సని ద పమ గ పమ గ
రిగమప గరి సనిదప ద రిగరి సనిదప మగపద గసనిదప దని సనిదసరిగపద రిగపద దరి
నీతోనే ఆగేనా సంగీతం
బిలహరి అని పిలవకుంటే స్వర విలాసం మార్చుకుంటే ఆరిపోదు గాన జ్యోతి
నీతోనే ఆగేనా సంగీతం