Elige una pista para reproducir
నా కోసమే నా కోసమే నువ్వున్నావు తెలుసా
నాకు నీ స్నేహమే ఊపిరైంది తెలుసా
మనకోసమే ప్రేమ పుట్టిందట తను మన జంటలో కోట కట్టిందట
ఈ బంధమే పంచ ప్రాణాలుగా పెంచుకోవాలట పంచుకోవాలట
నీ కోసమే నీ కోసమే నేనున్నాను తెలుసా
నాకు నీ స్నేహమే ఊపిరైంది తెలుసా
విన్నావో లేదో నువ్వీ సంగతి లోకాన ప్రతి వారు అంటున్నది
కళ్లార మనకేసి చూసేందుకే చూపుంది అన్నారు నిజమా అది
ఏం నీ మనసు ఆ మాట అవునేమో అనలేదా అనుమానంగా ఉన్నదా
ఆ జనమంతా అనుకొంటే కడదాకా నిలిచేలా సాగాలి ఈ ముచ్చటా
ఈ బంధమే పంచ ప్రాణాలుగా పెంచుకోవాలట పంచుకోవాలట
మనకోసమే ప్రేమ పుట్టిందట తను మన జంటలో కోట కట్టిందట
నా కోసమే నా కోసమే నా కోసమే నా కోసమే
నాలోన ఏ వింత దాగున్నది చిత్రంగ చూస్తవలా దేనికి
అసలైన సంతృప్తి కలిగిఉంటుంది ఈ బొమ్మ చెక్కాకే ఆ బ్రహ్మకి
ఓ ప్రాణం ఇద్దరిలా కనిపిస్తూ ఉంది ఇలా సగభాగం నువ్వు కదా
ఓ నీలోన సగమయేలా అదృష్టం నాదైన కలలాగే అనిపించదా
మనకోసమే ప్రేమ పుట్టిందట తను మన జంటలో కోట కట్టిందట
ఈ బంధమే పంచ ప్రాణాలుగా పెంచుకోవాలట పంచుకోవాలట
నీ కోసమే నీ కోసమే
నా కోసమే నా కోసమే నా కోసమే నా కోసమే