Elige una pista para reproducir

లేచింది నిద్ర లేచింది మహిళాలోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం
లేచింది మహిళాలోకం
ఎపుడో చెప్పెను వేమనగారు
అపుడే చెప్పెను బ్రహ్మం గారు
ఎపుడో చెప్పెను వేమనగారు అపుడే చెప్పెను బ్రహ్మం గారు
ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా
ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా
విస్సన్న చెప్పిన వేదం కుడా
లేచింది మహిళాలోకం
పల్లెటూళ్ళలో పంచాయితీలు
పట్టణాలలో ఉద్యోగాలు
పల్లెటూళ్ళలో పంచాయితీలు పట్టణాలలో ఉద్యోగాలు
అది ఇది ఏమని అన్ని రంగముల
అది ఇది ఏమని అన్ని రంగముల మగధీరులనెదిరించారు నిరుద్యోగులను పెంచారు
లేచింది మహిళాలోకం
చట్టసభలలో సీట్ల కోసం
భర్తలతోనే పోటి చేసి
చట్టసభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటి చేసి
ఢిల్లీ సభలో పీఠం వేసి
ఢిల్లీ సభలో పీఠం వేసి లెక్చరులెన్నో దంచారు విడాకు చట్టం తెచ్చారు
లేచింది నిద్ర లేచింది దద్దరిల్లింది పురుష ప్రపంచం
లేచింది నిద్ర లేచింది నిద్ర లేచింది మహిళా లోకం