Elige una pista para reproducir
Sencillo / Pista
చిరునవ్వుల తొలకరిలో
సిరిమల్లెల చినుకులలో
పలికెనులే హృదయాలే
పలికెనులే హృదయాలే తొలివలుపుల కలయికలో
చిరునవ్వుల తొలకరిలో
సిరిమల్లెల చినుకులలో
వసంతాలు దోసిట దూసి విసిరేను నీ ముంగిలిలో
తారలనే దివ్వెలు చేసి వెలిగింతు నీ కన్నులలో
నీవే నా జీవనాడిగా ఎగిసేను గగనాల అంచులలో
విరియునులే ఆ గగనాలే నీ వెన్నెల కౌగిలిలో
చిరునవ్వుల తొలకరిలో
సిరిమల్లెల చినుకులలో
ఉరికే సెలయేరులన్నీ వొదిగిపోవు నీ నడకలలో
ఉరిమే మేఘాలన్నీ ఉలికి పడును నీ పలుకులలో
నీవే నా పుణ్యమూర్తిగా
నీవే నా పుణ్యమూర్తిగా ధ్యానించు నా మధుర భావనలో
మెరియునులే ఆ భావనలే ఇరు మేనుల అల్లికలో
చిరునవ్వుల తొలకరిలో
సిరిమల్లెల చినుకులలో
పలికెనులే హృదయాలే తొలివలుపుల కలయికలో
చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో