Elige una pista para reproducir
॥పల్లవి॥ మగవాఁడు భ్రమసిన మరి తెలుపఁగరాదు
నగుఁబాటు చూడరమ్మ నాటకీఁడు కృష్ణుఁడు
॥చ1॥ కోవిల గుయ్యఁగాను గోపిక పిలిచె నంటా
ఆవల దగ్గరఁ బోయి అందుఁ గానక
ఆవేళ నొక్కనెమలి యాడ నేగఁగాఁ జూచి
బావించి చెలి యనుచుఁ బట్టఁబోయఁ గృష్ణుఁడు
॥చ2॥ తీగె యల్లాడఁగాఁ జూచి తెఱవచేసన్న లివి
నాగతి ననుచుఁ జేరి యటు గానక
సోగల నందుఁ గొలనిసొంపుఁ దామెరను జూచి
భాగులఁ జెవిమో మని పట్టఁ బోయఁ గృష్ణుఁడు
॥చ3॥ చెట్టుపైఁ బూవులు రాల చెలి సేసవెట్టె నంటా
అట్టే శ్రీవేంకటేశుఁ డాలకించఁగా
కట్టఁగడ నింతి యది గని నిజముగ వచ్చి
యెట్ట యెదుటనే వుండె నేచి కూడెఁ గృష్ణుఁడు