Elige una pista para reproducir
మరుగైనావ రాజన్నా కనుమరుగైనావా రాజన్నా
మా ఇంటి దేవుడవే మా కంటి వెలుగువే
ఒరిగినావ రాజన్నా ఒరిగినావ రాజన్నా
అద్దుమానం అడవిలోనా ఏలకాని అలకాడ
పైన పోయే పచ్చులారా ఏడమ్మా మన రాజన్నా
నువ్వొచ్చే దావల్లో పున్నాగా పూలుజల్లి
నీకోసం వేచుంటే చేజారీపోతీవా
చల్లానీ నీ నవ్వూ చక్కానీ నీ నడక
రచ్చబండా చేరకనే నేలరాలిపోతీవా
మాటతప్పని రాజన్నా మడమతిప్పని మనిషివయా
మరువజాలము నీ రూపం నీకు సాటి ఎవరయ్యా
మా గుండెల్లో గుడిసెల్లో కొలువుంటావు రాజన్నా
సాయం సంధ్యా దీపంలో నిన్నే తలుచూకుంటాము
నిన్నే తలుచుకుంటాము