Elige una pista para reproducir
పల్లవి
హరితానే వున్నాడన్నిటికీ - యే
వెరవు లేదిక మాకు వేణుగోపాలుడౌ
|| అనుపల్లవి||
వేడుచు కుజనుల వెంట దిరిగితే నేమి
నాడు వ్రాసిన వాడు - నేడు వేరే వ్రాసునా - నర
॥హరి||
చరణం
పట్టెడన్నానికై - పరితాప మెందుకు
పుట్టించినవాడు - పూరి మేపునా - నర
॥హరి||
చరణం
అదయు లొక్కరి శ్రమ ఆర్చేర తీర్చేర
మొదట బుట్టిన చావ - తుదనెందు గల్గు - నర
॥హరి||
చరణం
ఒదిగినంతే చాలునొక లక్ష తృణమైన
పదిలముగ ధ్రువరాజ్య పట్టమేలగ వలెనా
॥హరి||
చరణం
జంట బాయక ప్రభువు - నంటి తిరిగిన రాదు
కొంటే రాని సొమ్ము కొసరితే వచ్చునా - నర
॥హరి||