Elige una pista para reproducir
సిరిసిరి మువ్వ
విరిసిన పువ్వా
చెకుముకి రవ్వా ఓ
ఎగసిన జువ్వా
కెరటం సాగదా నీ వెనకే
మెరుపే ఆగదే నవ్వులకే
ఆ నింగిలో వెన్నెలకే
కన్నేదో కుట్టిందా నిన్ను చూశాకే
సిరిసిరి మువ్వ
విరిసిన పువ్వా
చెకుముకి రవ్వా ఓ
ఎగసిన జువ్వా
తనన ధీం తనన ధీం
తనన నానేనా
తనన ధీం తనన ధీం
తానినా
(సయ్యో సయ్యో సయ్యో సయ్యో సా)
(సయ్యో సయ్యో సయ్యో సయ్యో సా)
(సయ్యో సయ్యో సస)
(సానిమమ సానిమమ సా)
తూరుపే మేలుకొనగా
ఎదుటే వాలిన వెలుగే నువ్వా
రేయితో చేయి కలిపిన
వెన్నెల పూతల చలవే నువ్వా
బ్రహ్మకే ఆశ రేపిన
భువిలో తారకవా
నువ్ సయ్యంటేనే సయ్యా
చల్ చయ్యా చల్ చయ్యా
అడుగేశావంటే హయ్యా
తగదయ్య తగదయ్య
జడ గంటలు ఊగే జోరే
జలపాతం బాదలు తీరే
గుడి గంటల్లాగా మోగే
గుండె లోగికి చేరుకోవే
కెరటం సాగదా నీ వెనకే
మెరుపే ఆగదే నవ్వులకే
ఆ నింగిలో వెన్నెలకే
కన్నేదో కుట్టిందా నిన్ను చూశాకే
సిరిసిరి మువ్వ
విరిసిన పువ్వా
చెకుముకి రవ్వా ఓ
ఎగసిన జువ్వా
ఘల్లు మను కాలిమువ్వను
జతులే పాడే జయగీతాలు
స్నేహమే ఏడు రంగుల
అలలై పొంగే ఆనందాలు
ముంగిటే రంగవల్లులు
వేచిన వైనాలు
ఆకాశం అందేదాక
పరవల్లే పరవల్లే
పాతాళం అంచే చూసే
వయసుంది వరదల్లే
ఇక చిందే వెయ్యాలమ్మో
కనువిందే చెయ్యాలమ్మో
ఆ నాలుగు దిక్కులు ఏకం అయ్యే
వేడుకలు చూడనీవే
సిరిసిరి మువ్వ
విరిసిన పువ్వా
చెకుముకి రవ్వా ఓ
ఎగసిన జువ్వా
కెరటం సాగదా నీ వెనకే
మెరుపే ఆగదే నవ్వులకే
ఆ నింగిలో వెన్నెలకే
కన్నేదో కుట్టిందా
నిన్ను చూశాకే
సిరిసిరి మువ్వ
విరిసిన పువ్వా
చెకుముకి రవ్వా ఓ
ఎగసిన జువ్వా