Elige una pista para reproducir
॥పల్లవి॥ అని రావణుతల లట్టలుఁ బొందించి
చెనకి భూతములు చెప్పె బుద్ధి
॥చ1॥ కట్టిరి జలనిధి కపిసేన లవిగో
చుట్టు లంక కంచుల విడిసె
కొట్టిరి దానవకోట్ల తలలదే
కట్టిడి రావణగతియో నీకు
॥చ2॥ యెక్కిరి కోటలు యిందరు నొకపరి
చిక్కిరి కలిగిన చెరయెల్ల
పక్కన సీతకుఁ బరిణామమాయ
నిక్కె(క్క?)ము రావణ నీకో బ్రదుకు
॥చ3॥ పరగ విభీషణుఁ బట్టము గట్టెను
తొరలి లంకకును తొలుఁదొలుతే
గరిమెల శ్రీవేంకటగిరిరాముఁడు
మెరసెను రావణ మేలాయఁ బనులు