Elige una pista para reproducir
మనసా వాచా కర్మణా నిను ప్రేమించ
నా మనసనే వీడి కోటకే నిన్నే రాణిని చేస్తా
కర్త కర్మ క్రియ నాకు నువ్వేనంట
నా వలపుల సీమకు రాజువి నువ్వే రారా దోరా
కదిలే వెన్నెల శిల్పం నీవని కన్నుల కోలువుంచా
కురిసే మల్లెల జడిలో ప్రేయసి నువ్వేనని తలిచా
మధునుడు పంపిన వరుడే నువ్వని మనవే పంపిచా నా మనసే అర్పించా
మనసా వాచా కర్మణా నిను ప్రేమించ
నా మనసనే వీడి కోటకే నిన్నే రాణిని చేస్తా
కర్త కర్మ క్రియ నాకు నువ్వేనంట
నా వలపుల సీమకు రాజువి నువ్వే రారా దోరా
దిక్కులు నాలుగు అని అందరు అంటున్న కాదు ఒకటేనని నిన్నే చూపిస్తా
ప్రాణాలు ఐదు అని ఎందరు చెపుతున్న ఒకటే ప్రాణమని మననే చూపిస్తా
ఎన్నడు ఓడని ప్రేమకు ఋతువులు ఆరే కాదమ్మ
జంటగ సాగుతు పెళ్లికి నేడే అడుగులువేద్దామా
ఇష్టైశ్వర్యం మనకందించె వరమే ఈ ప్రేమ ప్రేమకు మనమే చిరునామా
మనసా వాచా కర్మణా నిను ప్రేమించ
నా మనసనే వీడి కోటకే నిన్నే రాణిని చేస్తా
కన్నులు ఉన్నవిలా నిను చూసేటందుకులే నాకంటికి వెలుతురిలా నువ్వుంటే చాల్లే
పెదవులు ఉన్నవిలా నినుపిలిచేటందుకులే ఆపిలిచే పేరొకటే నీదైతే చాల్లే
పాదం ఉన్నది కడవరకు నీతో నడిచేందుకులే
అందం ఉన్నది నీ కౌగిట్లో అలసేటందుకులే
హృదయం ఉన్నది నిన్నే తనలో దాచేటందుకులే అది ఒక సొంతం నాకే
మనసా వాచా కర్మణా నిను ప్రేమించ
నా మనసనే వీడి కోటకే నిన్నే రాణిని చేస్తా
కర్త కర్మ క్రియ నాకు నువ్వేనంట
నా వలపుల సీమకు రాజువి నువ్వే రారా దోరా
మనసా వాచా కర్మణా నిను ప్రేమించ
నా మనసనే వీడి కోటకే నిన్నే రాణిని చేస్తా
మనసా వాచా కర్మణా నిను ప్రేమించ
నా మనసనే వీడి కోటకే నిన్నే రాణిని చేస్తా