Elige una pista para reproducir
Sencillo / Pista
అలా శ్రీనివాసుని పద్మావతి దేవిని
వదిలి వెలుతూ ఉంటే
శ్రీనివాసుని గుండెల్లో గునపం
గుచ్చుకున్నట్టుందమ్మో
గుండెను మెలిపెడుతున్నా
బాధని పంటి కింద
కంటి కింద నీరుని కానరాకుండా
ఎక్కెక్కిబెడుతున్నాడమ్మో
ఓగలమ్మ కొడుకో ఓ శ్రీనివాసా
పేరూ లేదు ఊరూ లేదు
ప్రేమించేసిందండోయ్ ఆహా
అమ్మ లాలో రామ్ భజన
మాట లేదు మనవు లేదు
మనసిచ్చేసిందండోయ్ ఆహా
అమ్మ లాలో రామ్ భజన
వజ్రం లాంటి మొఖము
వాడిపోయినాది ఆహా
(అమ్మ లాలో రామ్ భజన)
సిలకలాంటి మొఖము
సిన్నబోయినాది ఆహా
(అమ్మ లాలో రామ్ భజన)
నిన్ను ఎవరు తిట్టారో ఉయ్యాలో (ఉయ్యాలో)
నిన్ను ఎవరు కొట్టారో ఉయ్యాలో (ఉయ్యాలో)
నిన్ను ఇడిసిపోతాంది ఉయ్యాలో
నీ గోడెవరు ఇనేది ఉయ్యాలో
ఆ శ్రీనివాసుడికి
ఆస్తి లేదు అంతస్తు లేదని
ఆ పద్మావతి దేవికి
మేడలు మిద్దెలు ఉన్న
పెద్దేంటి సంబంధము చేస్తానని
ఆకాశ మహారాజు గారు అంటున్నాడమ్మో
ఇక్కడ శ్రీనివాసుడు
చెట్లు పుట్టలు తిరుగుతున్నాడు
చిం చిమ్మారంకారు చిమ్మాడుతుంటే
కాకులు గద్దలు కారడుతుంటే
అన్నవస్త్రాల గట్టు పెట్టాడు
నిద్రహారాలు విడిచి పెట్టడమ్మో
ఓగలమ్మ కొడకా శ్రీనివాసుడా
నోయని నోములు
నోచుకున్నాడమ్మా ఆహా
(అమ్మ లాలో రామ్ భజన)
సేయని పూజలు
సేసుకున్నాడమ్మా ఆహా
(అమ్మ లాలో రామ్ భజన)
శివుని మాసపు రాత్రి
శివుని జాగరాలు ఆహా
(అమ్మ లాలో రామ్ భజన)
మాఘ పున్నమున
మా పుణ్య నదుల తానాలు ఆహా
(అమ్మ లాలో రామ్ భజన)