Elige una pista para reproducir
ప్రేమేనా ఓఓ
ఓహ్ ప్రేమించా కొత్తగా ఇది ప్రేమని తెలియక
మానసిచ్చా పూర్తిగా నా మనసుని అడగక
నువ్వైనా నేనైనా అనుకోనిది
నీలోన నాలోనా జరిగే ఇది
బాగుందే బాగుందే ఎదో బంధమే
సాగిందే నీతో పాదమె
బాగుందే బాగుందే ఎదో బంధమే
ఊగిందే నీకైనా హృదయమే
ద్వేషమే స్నేహమైయి కష్టమే ఇష్టమైయి
దూరమే తీరమైయి భారమే తేలికైయి
పంతాలే చిలిపిగా చదివిన పాటలైయి
భేదాలే చివరికి కలిసిన భావాలై
ఏనాడో చినుకల్లే మొదలైనదీ
ఈనాడే వరదైనా వరమే ఇది
బాగుందే బాగుందే ఎదో బంధమే
మోగిందే నాలో మౌనమే
బాగుందే బాగుందే ఎదో బంధమే
లాగిందే ఊహాలోకమే
ప్రేమేనా ఓఓ
చూపులే చిత్రమై మాటలే మంత్రమై
ఊపిరే ఊయలై నవ్వులే వెన్నెలై
దేహాలే ప్రణయపు కొవుల ధారాలై
ప్రాణాలే మమతల మల్లెల హారాలై
బ్రతుకంతా బ్రతికించే భావం ఇది
ప్రతి రోజు జన్మించే మార్గం ఇది
బాగుందే బాగుందే ఎదో బంధమే
నువ్వంటే న ప్రతిబింబమే
బాగుందే బాగుందే ఎదో బంధమే
నీకేలే నా సగ భాగమే
ప్రేమించా కొత్తగా ఇది ప్రేమని తెలియక
మనసిచ్చా పూర్తిగా నా మనసుని అడగక
నువ్వైనా నేనైనా అనుకోనిది
నీలోన నాలోనా జరిగే ఇది
బాగుందే