Elige una pista para reproducir
॥పల్లవి॥ దేవదుందుభులు నలుదిక్కులందు
తావులనే వేవేలు ధ్వనులియ్యఁగాను
॥చ1॥ వేంకటాద్రిదేవుఁడదే వేడుకతోఁ బెండ్లాడీ
లంకెల నిప్పుడే కమలాదేవిని
కొంకక ముప్పదిమూఁడుగోట్లు దేవతలాల
వుంకువ విచ్చేయరో మహోత్సవవేళ
॥చ2॥ వనజనాభుఁడు నిత్యవైభవానఁ జేకొనె
అనయము నిదివో యాదిలక్ష్మిని
మునులాల భుషులాల ముంచినభూసరలాల
సొనిసి యిందరుఁగూడి సుముహూర్త మనరో
॥చ3॥ సురకన్యలాల భూసురనాగకన్యలాల
మరిగికూడీ నలమేలుమంగ నితఁడు
నిరతి శ్రీవేంకటనిలయుని నీకెను
యిరవుగ దీవించి యిందరునుఁ బాడరో