Elige una pista para reproducir
పువ్వులనడుగు
నవ్వులనడుగు
పువ్వులనడుగు
నవ్వులనడుగు
రివ్వున ఎగిరే గువ్వలనడుగు
నువ్వంటే నాకెంత ప్రేమో
ఇది ఏ నాటి అనుబంధమో
కొమ్మలనడుగు
రెమ్మలనడుగు
కొమ్మలనడుగు
రెమ్మలనడుగు
ఝుమ్మని పాడే తుమ్మెదనడుగు
నువ్వంటే నాకెంత ప్రేమో
ఇది ఏ నాటి అనుబంధమో
పల్లె పదానికి పల్లవినై
పడుచందానికి పల్లకినై
పెదవే పల్లవి కలిపేద్దాం
నా పల్లవి నీలో పలికిస్తా
నీవు నేనుగా
పూవు తావిగా
జన్మ జన్మలకు
విడని జంటగా
నీవే నా దీవెనా
ఈ పొద్దు చాలక
నా ముద్దు తీరగ
రేపన్నదేలేక చెలరేగిపోతా
పువ్వులనడుగు
పువ్వులనడుగు
నవ్వులనడుగు
రివ్వున ఎగిరే గువ్వలనడుగు
నువ్వంటే నాకెంత ప్రేమో
ఇది ఏ నాటి అనుబంధమో
పొడిచే పొద్దుల తూరుపునై
వాలే పొద్దుల పడమరనై
దిక్కులు నీలో కలిపేస్తా
దిక్కువి నీవని పూజిస్తా
నింగి సాక్షిగా
నేల సాక్షిగా
మమతల మల్లెల మనస్సాక్షిగా
నీవే నా దేవతా
ఆ ఆ ఆ
వెయ్యేళ్ల కోరిక
నూరేళ్లు చాలక
ఏడేడు జన్మలు నీదాననౌతా
కొమ్మలనడుగు
కొమ్మలనడుగు
రెమ్మలనడుగు
ఝుమ్మని పాడే తుమ్మెదనడుగు
నువ్వంటే
నువ్వంటే
నాకెంత ప్రేమో ప్రేమో
ఇది ఏ నాటి అనుబంధమో