Elige una pista para reproducir
భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా

భావములోన బాహ్యమునందును
హరియవతారములే అఖిలదేవతలు హరిలోనివే బ్రహ్మాణ్డములు

హరినామములే అన్ని మంత్రములు
హరినామములే అన్ని మంత్రములు
హరిహరి హరిహరి హరి యనవోమనసా
హరిహరి హరిహరి హరి యనవోమనసా
భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా
భావములోన బాహ్యమునందును
విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు

విష్ణుడొక్కడె విశ్వాంతరాత్ముడు
విష్ణుడొక్కడె విశ్వాంతరాత్ముడు
విష్ణువు విష్ణువని వెదకవో మనసా
విష్ణువు విష్ణువని వెదకవో మనసా
భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా
భావములోన బాహ్యమునందును
అచ్యుతుడితడె ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు

అచ్యుతుడు శ్రీవేంకటాద్రిమీదనిదె
అచ్యుతుడు శ్రీవేంకటాద్రిమీదనిదె
అచ్యుత అచ్యుత శరణనవో మనసా