Elige una pista para reproducir

నందామయా గురుడ నందామయా
ఉందామయా తెలుసుకుందామయా
నందామయా గురుడ నందామయా
ఉందామయా తెలుసుకుందామయా
మెరిసే సంఘం మేడిపండు
దాని పొట్ట విప్పి చూస్తే పురుగులుండు
మెరిసే సంఘం మేడిపండు
దాని పొట్ట విప్పి చూస్తే పురుగులుండు
ఆ కుళ్ళు లేని చోటు ఇక్కడే
కుళ్ళు లేని చోటు ఇక్కడే
అనుభవించు రాజా ఇప్పుడే
(ఆనంద సారం ఇంతేనయా)
(ఆనంద సారం ఇంతేనయా)
(ఆనంద సారం ఇంతేనయా)
నందామయా గురుడ నందామయా
ఉందామయా తెలుసుకుందామయా
పుట్టినప్పుడు బట్ట కట్టలేదు
పోయేటప్పుడు అది వెంట రాదు
పుట్టినప్పుడు బట్ట కట్టలేదు
పోయేటప్పుడు అది వెంట రాదు
నడుమ బట్ట కడితే నగుబాటు
నడుమ బట్ట కడితే నగుబాటు
నాగరీకం ముదిరితే పొరబాటు
(వేదాంత సారం ఇంతేనయా)
(వేదాంత సారం ఇంతేనయా)
(వేదాంత సారం ఇంతేనయా)
నందామయా గురుడ నందామయా
ఉందామయా తెలుసుకుందామయా
తెలుసుకుందామయా తెలుసుకుందామయా
తెలుసుకుందామయా