Elige una pista para reproducir
పల్లవి
కన్నతల్లి కరుణించి బ్రోవుమిక -
నన్యుడని మనసా వేరెంచక
అనుపల్లవి
సన్నుతింతు నరుణాద్రిపురి వెలయు -
సాంబశివుని ముద్దు మోహనాంగీ
చరణం
శాంతరూపి శరదిందుకళాధరి -
చండభైరవీ త్రిశూలినీ
సంతోషముగ ముద్దుగా నభీష్టమొసగు -
సన్నుతాంగి సాధుపోషణీ
పంతముగను రంభాది కాంతలు -
పంతువరాళి పదచాళిని
వింతగాను కొలువుండు వేళలో
వేడ్కమీర నానందభైరవి
కన్నతల్లి
చరణం
కంబుకంఠి కలహంసగామిని
కౌమారి పరమకల్యాణి
అంబుజాక్షులెల్ల వేగ సురటి విసరే -
టందము గనుగొని
తుంబురు నారదులెల్ల నీ మహిమ -
తొలి జామున వీణను బిలహరిని
గంభీరముగ శంకరాభరణమును -
గానములను సేయుదు రనుదినమును
కన్నతల్లి
చరణం
నగరాజకుమారి నీతోడి -
నాణెముగల దైవము లేదనుచు
జగతిలోన జనులెల్ల పొగడగను
జలజనేత్రి మధ్యమావతి
సొగసుగాను సారంగ నయనలు
సొంపుమీర సారంగ మీటుచు
బాగుగాను పాడ నసావేరి -
బాల వేణుగోపాలసోదరి
కన్నతల్లి!