Elige una pista para reproducir
ప్రాణేశ్వరి జయంతీ
రారా కనరారా కరుణ మానినారా ప్రియతమలారా
రారా కనరారా కరుణ మానినారా ప్రియతమలారా
రారా
నాలో నాలుగు ప్రాణములనగా నాలో నాలుగు దీపములనగా
నాలో నాలుగు ప్రాణములనగా నాలో నాలుగు దీపములనగా
కలిసి మెలసి అలరించిన చెలులే
కలిసి మెలసి అలరించిన చెలులే నను విడనాడెదరా
రారా కనరారా కరుణ మానినారా ప్రియతమలారా
రారా
మీ ప్రేమలతో మీ స్నేహముతో
మీ ప్రేమలతో మీ స్నేహముతో అమరజీవిగా నను చేసితిరే
మీరు లేని నా బ్రతుకేలా
మీరు లేని నా బ్రతుకేలా మరణమె శరణముగా
రారా కనరా కరుణ మానినారా ప్రియతమలారా
రారా
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు