Elige una pista para reproducir
నా కాటుక కళ్లను నువ్వే
తెగ సూటిగ చూస్తూ ఉంటే
నా గుండెకు చక్కిలిగింతే
ఓ పిల్లోడా (ఓ పిల్లోడా)
నా ఊహల లోకంలోకే
నువు నవ్వుతు వస్తూ ఉంటే
నా ఊపిరి వేసెను గంతే
ఓ పిల్లోడా (ఓ పిల్లోడా)
ఎదలో అలలే ఎగసే ఎగసే
పరుగే తీసే మనసే
కల ఇలా నిజములా
నా నీడకు రంగులు పూసే
నీ పరిచయం ఓ పరవశం
నా ఆశలు పిలిచే
ఈ కలవరం ఓ తొలి వరం
నా ఈడుకి ప్రేమను తెలిపే
నువ్వే ఎదురైతే మరిచాలే జగమునే
పిల్లగాడా నువ్వంటే నాకెంతో ఇష్టమేరా
పిల్లగాడా నువ్వంటే నాకింకా పిచ్చిలేరా
పిల్లగాడా నువ్వంటే నాకెంతో ఇష్టమేరా
పిల్లగాడా నువ్వంటే నాకింకా పిచ్చిలేరా
నా నుదుటి కుంకుమ బొట్టవుతావా
ఒట్టేసి జట్టవుతావా
నా చేతి మట్టి గాజులవుతావా
ప్రతి క్షణం సడి చేస్తావా
నా చెవి బుట్టల జోడే నీవై
నన్నంటి పెట్టుకొనుంటూ ఊయలే ఊగవా
నా మెడన పూసల దండే నీవై
ఎదపైన చిందే వేయవా
పిల్లగాడా నువ్వంటే నాకెంతో ఇష్టమేరా
పిల్లగాడా నువ్వంటే నాకింకా పిచ్చిలేరా
పిల్లగాడా నువ్వంటే నాకెంతో ఇష్టమేరా
పిల్లగాడా నువ్వంటే నాకింకా పిచ్చిలేరా
(పిల్లగాడా పిల్లాగాడా నువ్వంటే నాకు ఇష్టమేరా)
(పిల్లగాడా పిల్లాగాడా నువ్వంటే ఇంకా పిచ్చిలేరా)
(పిల్లగాడా పిల్లాగాడా నువ్వంటే నాకు ఇష్టమేరా)
(పిల్లగాడా పిల్లాగాడా నువ్వంటే చాలా పిచ్చిలేరా)
ఏడేడు జన్మాలింకా నాతో
ఏడడుగులే వేస్తావా
ఆరారు కాలాలింకా నాతో
కౌగిలికి తోడుంటావా
ఈ పంచ భూతాలే సాక్షిగా
నాకున్న నాలుగు దిక్కులు
చూపనా నువ్వని
మూడంటే మూడే ముళ్లేస్తావా
మన రెండు హృదయాలు ఒకటని
పిల్లగాడా నువ్వంటే నాకెంతో ఇష్టమేరా
పిల్లగాడా నువ్వంటే నాకింకా పిచ్చిలేరా
పిల్లగాడా నువ్వంటే నాకెంతో ఇష్టమేరా
పిల్లగాడా నువ్వంటే నాకింకా పిచ్చిలేరా