Elige una pista para reproducir
Sencillo / Pista
నా ప్రేమ నవ పారిజాతం
పలికింది ప్రియ సుప్రభాతం
నా ప్రేమ నవ పారిజాతం
పలికింది ప్రియ సుప్రభాతం
నీ ఎద వీణపై
మన కథ మీటగా
నీ ఎద వీణపై
మన కథ మీటగా
అనురాగాల రాదారి రానా
నూరేళ్ళ బంధాన్ని కానా
నా ప్రేమ నవ పారిజాతం
పలికింది ప్రియ సుప్రభాతం
వేదంలో స్వదంలా స్థిరంగా
సాగాలి సుఖంగా శుభంగా
స్నేహంలో యుగాలే క్షణాలై
నిలవాలి వరాలై నిజాలై
గతజన్మ బంధాలు నేడు
జతకూడి రావాలి తోడు
గగనాల పందిళ్ళలోన
సగ భాగమౌతాను నీకు
ఇక సుముహుర్త మంత్రాలలోన
శృతి చేయి అనురాగ వీణా
నా ప్రేమ నవ పారిజాతం
పలికింది ప్రియ సుప్రభాతం
నా ప్రేమ నవ పారిజాతం
పలికింది ప్రియ సుప్రభాతం
ఈనాడే ఫలించే తపస్సే
ప్రేమించి వరించే వయస్సే
లోకాలే జయించే మనస్సే
నీకోసం నిజంగా తపించే
సరసాల సమయాలలోన
మనసారా పెనవేసుకోనా
అనువైన నా గుండెల్లోనా
కడదాకా నిను దాచుకోనా
ఇక సిరిమల్లి తలంబ్రాలలోనా
పరువాలు పండించుకోనా
నా ప్రేమ నవ పారిజాతం
పలికింది ప్రియ సుప్రభాతం
నీ ఎద వీణపై
మన కథ మీటగా
నీ ఎద వీణపై
మన కథ మీటగా
అనురాగాల రాదారి రానా
నూరేళ్ళ బంధాన్ని కానా
నా ప్రేమ నవ పారిజాతం
పలికింది ప్రియ సుప్రభాతం