Elige una pista para reproducir
పల్లవి
బొట్టుగట్టినవాని యింటికి - పోయి వచ్చెద నాసామి
అనుపల్లవి
పుట్టినింటనే యుండుట సతులకు
పొసగునా వేణుగోపాల
చరణం
చెలియలిపెండ్లికి దిరుగా వచ్చెద -
నెలదినములలో నేను
చెలిమి యింతలో మరువక యుండుమీ -
చెలువుడ నీ మదిలోను
కలుగజేసె నీ నడవడి దైవము -
కులభామల కెల్లను
నిలువరముగ నీ దయ యిందుండితే -
నీ సొమ్మేగాదా ఈ మేను /బొట్టు//
చరణం
తిరునాళ్ళనుచు నీవయినా యొక -
పరి యందాక రారా
గురుతు జూచుచుండుదు నీ వేలి యుం -
గరమయినా యీరా
విరహ మోర్వలేనంటివి యేరా -
యిరువరులకు సరిపోరా
మరిమరి సెలవిమ్మని యడిగితే నా -
మాటలు బట్టవు వోరి నాసామి /బొట్టు//
చరణం
కోరిక లొకసారి తీరెగదా యిక -
గొబ్బున సెలవీయరాదా
శౌరి వేణుగోపాల తిరుగా చల -
పోరుట మరియాదా
వారు వీరు మన జాడలు జూచితే -
యేరా మోసము గాదా .
తీరదింక నేనేమిసేయుదు -
దేవుడలిగిని మనమీద //బొట్టు//