Elige una pista para reproducir
Sencillo / Pista
తెలియదే తెలియదే
మునుపిది తెలియదే
సిలవలే బరువుగా
నిలిచిన హృదయము
అలవలే చురుకుగా
గలగల ఎగసెనులే
అమ్మబాబోయ్
మనసొక విధముగ మనిషొక విధముగ
నడిచిన బ్రతుకది గడిచిన గతమది
మన అడుగుల దిశ
మనసును నడిపినదే
అవునా
ఓ ప్రేమ గీతం పలికిందిగా
మౌనాలనే వెలిగించగా
ఓ ప్రేమ వర్షం కురిసిందిగా
నేనే ఇలా మోలకెత్తగా
తెలిసెనే తెలిసెనే విషయము తెలిసెనే
కలిసిన క్షణమున కలగక కలిగిన
కలవరమిదియని కధనము తెలిసెనులే
అయ్యుండొచ్చు
నుదుటన చెమటలు పెదవుల నగవులు
పొదుపగు పలుకులు మృదువగు తలపులు
మొదలగు గుణములు విరివిగ పరిచయమై
ఇదంతా నిజమేనా
ఓ ప్రేమ లోకం వెలిసిందిగా
నీతో ఇలా విహరించగా
ఓ ప్రేమ తీరం కలిసిందిగా
వరమే ఇలా కలిసుండగా
నిజం నిజం నిజం
నా ప్రతీపదం నిజం
నువ్వు కనబడితే మనసే
నా మనసే బంతిలాగ గెంతునే
నిజం నిజం నిజం
ఇది ముమ్మాటికి నిజం
నువ్వు తిరిగిన ఈ స్థలమే
ఈ స్థలమే నాకు పుణ్య క్షేత్రమే
ఓ ప్రేమ లోకం వెలిసిందిగా
నీతో ఇలా విహరించగా
ఓ ప్రేమ తీరం కలిసిందిగా
వరమే ఇలా కలిసుండగా